ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (11:15 IST)

తెలంగాణాలో విజృంభిస్తున్న కరోనా వైరస్

corona visus
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాపిస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ లక్షణాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
 
నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు వైద్య పరీక్షలు చేయగా, కోవిడ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆరు యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటితో కలుపుకుని ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 25కు చేరుకుంది. 
 
ఉమ్మడి వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీ నగర్‌కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్యులు టెస్టింగ్ కోసం పూణెలోని ల్యాబ్‌కు పంపించారు.