శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మే 2021 (16:55 IST)

ఏపీలో కోవిడ్ విజృంభణ.. 24 గంటల్లో 108 మృతులు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 86,878 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 20,345 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934కి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426 మంది, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 707 మంది కరోనా బారిన పడ్డారు. 
 
కోవిడ్ వల్ల చిత్తూరులో 18, విశాఖలో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో పది మంది, గుంటూరులో పది, విజయనగరంలో పది, ప్రకాశం తొమ్మది, నెల్లూరులో ఎనిమిది, కృష్ణ లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, అనంతపూర్‌లో ఐదుగురు, కర్నూలు ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కడపలో ముగ్గురు చొప్పున మొత్తం 108 మంది కరోనా కారణంగా మరణించారు. 
 
దీంతో మహమ్మారి రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 8,899కి చేరింది. నిన్న 14,502 మంది కోలుకోగా.. మొత్తంగా కరోనా బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 11,18,933కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,95,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,75,14,937 సాంఫిల్స్‌ను పరిక్షించారు.