గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 6 నవంబరు 2020 (15:43 IST)

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు రద్దు

కరోనా మమహమ్మారి కారణంగా రాష్ట్రంలో పలు ఆలయాలు మూతబడ్డాయి. కేంద్ర  ప్రభుత్వం అన్లాక్ సడలింపులతో ఇప్పుడిప్పుడే కొన్ని ఆలయాలు దర్శనాలకు నోచుకుంటున్నాయి. కానీ కరోనా మహమ్మారి దేవాలయాలను సైతం వదలడం లేదు. ఆలయాలలో కరోనా కేసులు రావడంతో ఒక్కో ఆలయం తాత్కాలకంగా దర్శనాలను సైతం నిలిపివేస్తున్నాయి.
 
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కరోనా కేసులు కలకలం రేపాయి. అంతర్వేది ఆలయంలో సేవలు అందించే నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో దేవాలయంలో దర్శనాలు రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో నేడు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
 
ఆలయంలో కరోనా కేసులు రావడం ఇది రెండోసారి. కేశ ఖండన సిబ్బందికి కరోనా రావడంతో ఇటీవల ఆ సేవలను కూడా రద్దు చేశారు. దీంతో ఆలయ పరిసరాలను శానిటైజేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో అంతర్వేది రథాన్ని తగులబెట్టడంతో  పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై హిందూ దార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
 
ఆపై కొత్త రథాన్ని రూపొందించి పనులు కొనసాగిస్తున్నారు. తర్వాతి కాలంలో భక్తులు ఎక్కువ రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.