మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (09:14 IST)

కళ్ళలో స్ప్రే చల్లి... మిస్టరీగా హోటల్ యజమాని హత్య!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. హోటల్ యజమాని కళ్ళలో స్ప్రే కొట్టి చంపేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలలోని పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లూరు గ్రామంలో ఈ హత్య జరిగింది. భాష్యం బ్రహ్మయ్య అనే వ్యక్తి గ్రామంలో చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. చెత్త పారవేసేందుకు బ్రహ్మయ్య ఊరి చివరకు వెళ్లాడు.
 
ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనాలపై వచ్చి బ్రహ్మయ్య ముఖంపై స్ప్రే చల్లి దాడి చేశారు. ఆ స్ప్రే కళ్లలో పడడంతో మంటలు పుట్టాయి. దాంతో కుటుంబ సభ్యులు బ్రహ్మయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. 
 
ఈ ఘటన పెదకూరపాడు మండలంలో తీవ్ర కలకలం రేపింది. బ్రహ్మయ్యను హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.