శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (16:31 IST)

బీజేపీ ఇచ్చిన పాచిపోయిన లడ్డూల టేస్ట్ మారిందా పవనూ? సీపీఐ రామకృష్ణ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని గతంలో చెప్పిన పవన్‌కు ఇపుడు లడ్డూల టేస్ట్ మారిందా? అని ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్రంలో చేవ చచ్చిన నాయకులు ముందుకు వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు మందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అప్రజాస్వామిక పోకడలపై తాము అలుపెరగని పోరు సాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. 
 
అంతేకాకుండా, ఒకవైపు, సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా దిశానిర్ధేశంలో పని చేస్తున్నారని ఆరోపించారు. ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ నేతలను కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీజేపీ నేతల డైరెక్షన్‌లో పని చేస్తున్న సీఎం జగన్‌ను దించి తనకు రోడ్ మ్యాచ్ ఇవ్వమని పవన్ అడగడంపై రామకృష్ణ విస్మయం వ్యక్తం చేశారు.