శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 మే 2023 (10:06 IST)

తీవ్ర తుఫానుగా మారిన మోచా... శ్రీలంక వద్ద ఏర్పడిన ఆవర్తనం

mocha cyclone
దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆవర్తనం సోమవారం ఉదయంలోగా అల్పపీడనంగా మారనుందని, ఇది ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని గోపాల్‌పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఇదే విషయంపై ఆ కేంద్ర అధికారి ఉమాశంకర్ దాస్ మాట్లాడుతూ, ఈ నెల పదో తేదీన వాయుగుండం తుఫానుగా మారనుండగా, దీనికి యెమెన్ దేశం మోచాగా నామకరణం చేసిందని తెలిపారు. 
 
ఈ తుఫాను తీవ్రరూపం దాల్చుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. 9వ తేదీన ఉత్తర దిశగా కేంద్ర బంగాళాఖాతంలో ప్రవేశించి ఆ తర్వాత ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. మంగళవారానికి దీనిపై పూర్తి వివరాలు వెల్లడించగమని చెప్పారు. 
 
అందువల్ల రాష్ట్రంలోని ఓడరేవులకు ఇంతవరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు. సముద్రంలో ట్రాలర్లు, మరబోట్లు ద్వారా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వీలైనంత త్వరగా ఒడ్డుకు చేరుకోవాలని కోరారు. 
 
మరోవైపు విదేసీ వాతావరణ అధ్యయన సంస్థలు కూడా మోచా తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని ఇది మయన్మార్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, ఈ తుఫాను ప్రభావం కారణంగా ఒడిశాకు పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.