1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 మే 2023 (16:17 IST)

తెలంగాణాలో మూడు రోజుల పాటు వర్షాలు

rain
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా ఈదురు గాలులు గంటకు 61 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకూ గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. 
 
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 41 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడుతాయని తెలిపింది. 
 
మరోవైపు, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని, ఇది ఈ నెల 8వ తేదీ నుంచి అల్పపీడనంగా మారే అవకాశంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ మరుసటి రోజున ఇది వాయుగుండంగా మారుతుందని చెప్పింది. వాయుగుండం ఉత్తర దిశగా పయనిస్తూ తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం లేకపోలేదని వాతావరణ కేంద్రం తెలిపింది.