గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:02 IST)

వలసకూలీలను కబళించిన మృత్యువు

కరోనా వైరస్‌ బారి నుంచి తప్పించుకున్నా మృత్యువు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఇద్దరిని కబళించింది.

చేబ్రోలు ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని కైకరం వద్ద జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 

ఇద్దరు యువకులు సైకిల్‌పై ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళుతుండగా వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతుల చరవాణి ఆధారంగా వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మృతుల వద్దనున్న వస్తువులను బట్టి వారు వలసకూలీలుగా అనుమానిస్తున్నారు.