బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (22:08 IST)

కరోనా: 24 గంటల్లో 1752 కేసులు..37 మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1752 కొత్త కేసులు, 37 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,452కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 4,813 మంది డిశ్చార్జి అవ్వగా.. 723 మంది మరణించినట్లు తెలిపింది.

ప్రస్తుతం 17,915 మంది కరోనా కారణంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.