కరోనా కట్టడిలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ: సజ్జల రామకృష్ణారెడ్డి
కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్‌మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
కరోనా కట్టడిలో అధికారులకు జగన్‌పూర్తి స్వేచ్ఛను ఇచ్చారన్నారు. గుజరాత్ నుంచి మత్స్యకారులను తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా టెస్ట్‌లు చేయడంలో దేశం ప్రధమస్థానంలో ఉందని ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కరోనా వైరస్ కంటే చంద్రబాబు ప్రమాదకరమని విమర్శించారు.
తన ప్రచారం ద్వారా చంద్రబాబు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, హైదరాబాద్‌లో కూర్చొని లేఖలు రాయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు ఇంకా తానే సీఎంని అనే భ్రమలో ఉన్నారని, ఆయన పైత్యం పరాకాష్టకి చేరిందని విమర్శించారు.