గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (19:38 IST)

తెలంగాణలో తొలి కరోనా మరణం

తెలంగాణలో కరోనాతో తొలి మరణం నమోదైంది. ఖైరతాబాద్‌లో కరోనాతో వృద్ధుడు(74) మృతి చెందాడు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తి గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోతే అతని రక్త నమూనాలు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

చనిపోయిన వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారు. 
 
ఇవాళ కొత్తగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఈటల రాజేందర్‌ అన్నారు.  తెలంగాణలో 65 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

పాతబస్తీలోని ఒకే కుటుంబంలో ఆరుగురికి, కుత్బుల్లాపూర్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకిందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి కార్మికుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.