మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (20:12 IST)

తెలంగాణలో మొబైల్​ రైతు బజార్లు

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన లాక్​డౌన్​ నూరు శాతం సఫలీకృతం అయ్యేలా.. మొబైల్​ రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ అడిషనల్​ డైరక్టర్​ లక్ష్మణుడు తెలిపాడు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు బజార్​ను ఆయన పరిశీలించారు.

కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయ మార్కెట్​ శాఖ ఆధ్వర్యంలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా​ వనస్థలిపురంలోని రైతు బజార్​ను వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు పరిశీలించారు. కూరగాయాలు విక్రయించే వారు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు.

మాస్క్​లను ధరించాలని, క్యూ పద్ధతి, సామాజికి దూరం పాటించాలని విక్రయదారులను, కొనుగోలు దారులను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ మొబైల్ రైతు బజార్ సౌకర్యాలను ప్రజలు వినియోగించుకుని లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. త్వరలోనే మొబైల్ రైతు బజార్లలో పండ్లునూ పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.