శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (20:08 IST)

తెలంగాణలో ఏప్రిల్‌ 15వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 15వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. దీనివల్లే ఈ వ్యాధిని నివారించవచ్చునని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

కేంద్రం గతంలో ప్రకటించినట్లుగానే, తాముకూడా అప్పటి వరకు కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాత్రి పూట కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాని కేసీఆర్‌ చెప్పారు.

20 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారని... ఇవాళ ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు.
 
ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్
రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 59కి చేరాయి. ఇవాళ ఒక్కరోజే 10 మందికి వైరస్​ నిర్ధరణ అయినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లేకపోతే భయంకర పరిస్థితులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే సమయం ఇది కాదన్నారు.

స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్షని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ఒక వ్యక్తి ఆస్పత్రిలో కోలుకుని ఇంటికి వెళ్లారని వెల్లడించారు. రాష్ట్రంలో 20 వేల మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారని సీఎం ప్రకటించారు.

వీరంతా ఐసోలేషన్‌, ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లేకపోతే భయంకర పరిస్థితులు వచ్చేవని వివరించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఈ వ్యాధికి మందులు లేకపోవడం పెద్ద బలహీనతని అన్నారు.

కరోనా వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందన్నారు. మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని విజ్ఞప్తి చేశారు. స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పాటించడం తప్ప గత్యంతరం లేదన్నారు. స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్షని పునరుద్ఘాటించారు.

నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే సమయం ఇది కాదన్నారు. అన్ని చర్యలకు ప్రభుత్వం వంద శాతం సిద్ధంగా ఉందని వెల్లడించారు. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని ప్రధాని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
 
ప్రజలు ఆకలితో అలమటించొద్దు
విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆకలితో అలమటించవద్దని సీఎం కేసీఆర్​ కోరారు. ఏ రాష్ట్రాలకు చెందిన వారినైనా ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పారిశ్రామిక కూలీలు, ఇతర రంగాల కూలీలు కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఒక్కరికి భోజన పెట్టే బాధ్యత తనపై ఉందన్నారు. హాస్టళ్లు మూస్తారని ఇతర రాష్ట్రాల విద్యార్థులు భయపడుతున్నారు. "విద్యార్థులు ఉండే హాస్టళ్లు ఎట్టి పరిస్థితుల్లో మూయరు. పేదలు, బిచ్చగాళ్లు, కూలీలు ఆకలితో బాధపడకుండా చర్యలు తీసుకుంటున్నాం.

పౌల్ట్రీలు, డెయిరీలకు గడ్డి తరలించే వాహనాలను ఎవరూ అడ్డుకోరు. చికెన్‌ తింటే వ్యాధి ప్రబలుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శారీరక దారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. చికెన్‌, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా కట్టడికి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి విటమిన్‌ సీ పండ్లు తోడ్పడతాయి" అని కేసీఆర్​ అన్నారు.