శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:36 IST)

ఢిల్లీలో దారుణం.. మాటువేసి కన్నబిడ్డ కళ్లెదుటే తండ్రి హత్య

ఢిల్లీలో దారుణం జరిగింది. కన్నబిడ్డ కళ్ళెదుటే తండ్రిని హత్య చేశారు కొందరు దుండగులు. ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అక్బరుద్దీన్ ‌(40) అనే వ్యక్తి ఆ రాష్ట్ర రవాణా సంస్థలో పని చేస్తున్నాడు. ఈయన ఆదివారం రాత్రి తన ఐదేళ్ళ కుమారుడు, సోదరితో కలిసి తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. 
 
అతని ఇంటికి సమీపంలో మాటు వేసిన ఐదుగురు దుండగులు.. అక్బరుద్దీన్ రాగానే కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుమారుడు.. వేగంగా తన ఇంటికి పరుగెత్తి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అంతలోనే దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్ రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్బరుద్దీన్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వారే అతడిని హత్య చేశారని, ఇందుకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుల తల్లి కూడా అక్కడే ఉంది.