సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 15 జులై 2019 (18:41 IST)

వెంకన్న సాక్షిగా ఆ విషయంపై రేవంత్, హరీష్ రావుల చర్చలు..?

తెలంగాణా రాష్ట్ర సమితిలో కెసిఆర్, కెటిఆర్, కవితల తరువాత హరీష్ రావుకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఈ మధ్యకాలంలో హరీష్ రావు పార్టీకి, కెసిఆర్ కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా హరిష్ రావు భారీ మెజారిటీతోనే గెలిచారు. కానీ కెసిఆర్‌తో మనస్పర్థలు రావడంతో ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు.
 
ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంపిగా గెలిచి పార్లమెంటులో ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు రేవంత్. అయితే ఆయన బిజెపి తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి తిరుమల వచ్చారు.
 
హరీష్ రావు, రేవంత్ రెడ్డిలు వేర్వేరుగానే తిరుమల వచ్చారు. కానీ తిరుమలలో రాజకీయంగా వీరి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిజెపిలోకి వెళ్ళేందుకు సిద్థమవుతున్న రేవంత్ తనతో పాటు మరో గట్టి నాయకుడిని ఆ పార్టీలోకి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందులోను హరీష్ రావు లాంటి వారైతే తెలంగాణాలో బిజెపి పటిష్టమవుతుంది. అగ్రనేతలుగా ఉండే అవకాశం ఉంటుందని అన్నా.. హరీష్ అన్నా మనం బిజెపిలో చేరుదాం.
 
ఇప్పుడు మనకు ఇదే కరెక్ట్ సమయం. ఆలోచించన్నా అంటూ రేవంత్ హరీష్ రావుకు చెప్పి సైలెంట్ అయిపోయారట. రేవంత్ అలా చెప్పగానే హరీష్ రావు ఆలోచనలో పడ్డారట. కాసేపటికి తేరుకుని కాస్త సమయమివ్వు.. తెలంగాణా రాష్ట్రసమతిలో నాకు ప్రత్యేకత ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి వచ్చేయడం భావ్యం కాదు. ఆలోచించుకుని నిర్ణయం తీసుకుందామంటూ చెప్పారట. సరేనంటూ రేవంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వెంకన్న సాక్షిగా జరిగిన ఈ నేతల మధ్య చర్చ ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సిందే.