శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 11 జూన్ 2019 (13:38 IST)

రోజాకు జగన్ పిలుపు... ఆమెకు ఏ ప‌ద‌వి ఇవ్వ‌నున్నారు..?

జ‌గ‌న్ సీఎం కాగానే మంత్రి ప‌ద‌వి ఖాయం అనుకున్న వారిలో రోజా ఒక‌రు. అయితే... ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో రోజాకు ఛాన్స్ రాలేదు. కార‌ణం ఏంటా అని అంద‌రూ షాక్ అయ్యారు. అయితే... రోజాకు జ‌గ‌న్ స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌నుకున్నార‌ని.. ఆ ప‌ద‌విపై రోజా విముఖ‌త చూపించ‌డంతో జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారని.. అందుకే రోజాకు ఏ ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... జగన్ మోహన్ రెడ్డితో భేటీకి రోజా అమరావతి బయలుదేరారట‌. కేబినెట్‌లో చోటు దొరక్కపోవడంతో బాగా ఫీలైంద‌ట‌. అయితే... రోజాకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇవ్వాలని జగన్ ఆలోచనట‌. ఆ పదవి తీసుకోడానికి కూడా రోజా విముఖత చూపిస్తుంద‌ట‌. దీంతో రోజాను జ‌గ‌న్ బుజ్జగిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఏ ప‌ద‌వి ఆమెకు ఇవ్వ‌నున్నారు అనేది సాయంత్రానికి స్పష్టత రానుంది.