కరోనా టీకా వేయించుకున్న వైద్యురాలి పరిస్థితి విషమం!
ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలను కోవిడ్ వారియర్లకు వేస్తున్నారు. అయితే, ఈ టీకా వేయించుకున్న పలువురు అస్వస్థతకు లోనవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఓ నర్సు ప్రాణాలు కోల్పోయింది. ఇపుడు తాజాగా ధనలక్ష్మి అనే వైద్యురాలు తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 23వ తేదీన కరోనా టీకా వేయించుకున్న ధనలక్ష్మి 25వ తేదీన అస్వస్థతకు లోనయ్యారు. ఈమెను తొలుత రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మార్చి చికిత్స అందిస్తున్నారు. అక్కడ నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.