మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 26 జనవరి 2021 (16:55 IST)

తల్లిదండ్రుల ఎదుటికి దుస్తుల్లేకుండా వచ్చి నిలబడ్డ అలేఖ్య, అలా చంపేయమని ఒత్తిడి

చిత్తూరు జిల్లా మదనపల్లె హత్య కేసు సంచలనంగా మారడమే కాదు అసలు హత్యకు తల్లిదండ్రులని ప్రేరేపించింది కూతురే. అది కూడా పెద్ద కూతురు అలేఖ్య. చెల్లిని చంపేయడంతో పాటు తల్లిదండ్రులను ఒప్పించి తనను చంపేస్తే తాను వెళ్ళి ఆమెను తీసుకొస్తానని చెప్పి బలవంతంగా చచ్చిపోయింది.
 
పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పురుషోత్తం నాయుడు, పద్మజ పెద్ద కుమార్తె అలేఖ్య, చిన్న కుమార్తె దివ్య. తండ్రి, ఇద్దరు కూతుర్లు కలిసి పదిరోజుల క్రితం వాకింగ్‌కు వెళ్ళారు. అయితే చిన్న కూతురు దివ్య దిష్టి తీసిన నిమ్మకాయను తొక్కింది. 
 
అక్కడి నుంచి దివ్యలో తెలియని భయం పట్టుకుంది. తల్లిదండ్రులు, అక్కతో ఏదో జరిగిపోతుందని భయపడింది. దీంతో అలేఖ్య కొన్ని వీడియోలను ఫోన్లో చూసింది. నీకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని నేనే వదిలిస్తానని చెప్పింది. అక్క అలేఖ్య అలా చెప్పడంతో పాటు తల్లిదండ్రులు కూడా కలిసి రాత్రి వేళల్లో ఇంటి మిద్దెపైకి వెళ్ళి అర్థరాత్రి పూట పూజలు చేయడం మొదలుపెట్టారు.
 
ఇలా అలేఖ్య దగ్గరుండి మరీ పూజలు చేసింది. తల్లి కూడా ఆధ్యాత్మిక భావనలో వెళ్ళిపోతే తండ్రిని మరీ ఒప్పించి ఈ పూజలు చేసేది అలేఖ్య. ఇలా వారు ముగ్గురు పూజలు చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆదివారం రాత్రి తనకు దెయ్యం కనిపించిందని దివ్య గట్టిగా కేకలు వేసింది. దీంతో అలేఖ్య నేరుగా ఆమె గదిలోకి వెళ్ళి డంబుల్స్‌తో దివ్యను గట్టిగా కొట్టింది. అక్కడికక్కడే దివ్య కుప్పకూలింది. చనిపోయింది.
 
వెంటనే తల్లిదండ్రులను తన గదిలోకి పిలిపించి నాకు సగం గుండు గీయండి. నా నోట్లో నవధాన్యాలు పెట్టి గట్టిగా వాటిని కొట్టండి. ఆ తరువాత నెత్తిపై కొట్టండి. నేను ఠక్కున చనిపోవాలి. చనిపోయిన వెంటనే చెల్లి ఆత్మను తీసుకొస్తాను. ఇద్దరం కలిసి ఉదయానికల్లా వచ్చేస్తామంటూ చెప్పింది.
 
తండ్రికి ఇది ఏమాత్రం ఇష్టం లేదు. తల్లి మాత్రం సిద్ధమైంది. అయిష్టంగానే తండ్రి పురుషోత్తంనాయుడు ఒప్పుకున్నాడు. అంతే.. తల్లిదండ్రులు ఇద్దరు ముందు నగ్నంగా వచ్చి నిలబడింది అలేఖ్య. మీరు కూడా బట్టలు మొత్తం విప్పేయాలని చెప్పింది. వారు కూడా నగ్నంగా నిలబడ్డారు. 
 
ఇలా ముగ్గురు నగ్నంగా నిలబడగా ఏకవస్త్రం కప్పుకుని నేలపై పడుకుంది అలేఖ్య. తాను చెప్పినట్లే చేయమంది. తల్లిదండ్రులు అలాగే చేశారు. కానీ అలేఖ్య చనిపోయింది కానీ ఇద్దరూ తిరిగి రానే లేదు.