సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (11:11 IST)

దెయ్యం పట్టిందని నిమ్మకాయల్ని తొక్కించారు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులే తమ కుమార్తెలను దారుణంగా హత్య చేసిన ఘటన భారత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి అనేక విస్తుపోయే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తమ కుమార్తెలకు దెయ్యం పట్టిందని కొద్ది రోజుల క్రితం పద్మజ కొందరు మంత్రగాళ్ళను ఇంటికి పిలిపించినట్లు పోలీసులు గుర్తించారు. 
 
వాకింగ్‌కి వెళ్ళినప్పుడు మంత్రించిన నిమ్మకాయలు తొక్కారని దీంతో వారికి దెయ్యం పట్టిందని పద్మజ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ భయంతోనే మంత్రగాళ్ళను పిలిపించగా ఆ వచ్చిన మంత్రగాళ్ళు పిల్లలిద్దరికీ తాయత్తులు కట్టి మెడలో రుద్రాక్ష మాలలు వేసినట్లు ఆమె చెబుతోంది.
 
ఇంటి చుట్టు నిమ్మ కాయలు కట్టిన తాంత్రికుడు నాలుగు రోజుల పాటు ఇంట్లోనే క్షుద్ర పూజలు కూడా చేసినట్లు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం దెయ్యం కనిపించిందని. చిన్నమ్మాయి దివ్య కేకలు పెట్టినట్లు చెబుతున్నారు. అయితే దెయ్యం ఆమెను ఆవహించింది అని భావించి అలేఖ్య ఆమె తల మీద దంబెల్ తో కొట్టి చంపిన దట. ఆమెను బతికించడం కోసం ఆమె మృతదేహం చుట్టూ పద్మజ, పురుషోత్తమ నాయుడు, అలేఖ్య ముగ్గురు కలిసి నగ్నంగా పూజలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. 
 
అనంతరం చనిపోయిన చెల్లిని బతికించడానికి తన ప్రాణం తీయాలని అలేఖ్య తల్లిని కోరిందట. ఆమె కోరిక మేరకు నవధాన్యాలు పోసిన చిన్నపాటి కలశం నోట్లో పెట్టి అలేఖ్య కూడా తల్లి పద్మజ కొట్టి చంపింది. ఇక తాంత్రికుల రాకపోకలు విజువల్స్ కూడా సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. అయితే ఈ సిసి ఫుటేజ్ బయటకు రాకుండా పోలీసులు రహస్యంగా ఉంచారు.