సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (11:14 IST)

అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులే కుమార్తెలను హతమార్చారు..

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులే తమ ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూజల పేరుతోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లో మదనపల్లి స్థానిక శివనగర్‌లో పురుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. పురుషోత్తమ నాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తుండగా, ఆయన భార్య పద్మజ ఓ ప్రైవేటు విద్యాసంస్థకు కరస్పాండెంట్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వీరికి అలేఖ్య(27), సాయిదివ్య(22) కుమార్తెలున్నారు.
 
ఈ క్రమంలో ఆదివారం కూడా ఇంట్లో పూజలు నిర్వహించారు. మొదట సాయి దివ్యను, ఆ తర్వాత అలేఖ్యను వారి నోట్లు చిన్న చెంబులు పెట్టి.. వ్యాయామం చేసే డంబెల్‌తో అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఆ ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు కాలేజీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో డీఎస్పీ రవి మనోహారాచారి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురుషోత్తమనాయుడు, పద్మజ, వారి ఇద్దరు కుమార్తెలు కూడా దైవభక్తితో పూజలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు