శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 జనవరి 2021 (13:21 IST)

తాపీ మేస్త్రీతో ప్రేమేంటి? మందలించినందుకు ప్రియుడిని పెళ్లాడి ఆత్మహత్య

గుంటూరు జిల్లా వివేకానంద నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తాపీ పని చేసే ఓ యువకుడితో ప్రేమలో పడిన కుమార్తెను తల్లి మందలించడంతో ఆమె ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా వివేకానంద నగర్‌కు చెందిన ప్రదీప్తి ఇంటర్ చదువుతోంది. ఆమె కాలేజీకి వెళ్లే క్రమంలో తాపీ పనిచేసుకునే యువకుడు కిరణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
 
విషయం యువతి ఇంట్లో తెలియడంతో.... తాపీ మేస్త్రీతో ప్రేమేంటి, పెళ్లేంటి అని ఆమె తల్లి మందలించినట్లు సమాచారం. దీనితో మనస్తాపం చెందిన యువతి తన ప్రియుడికి విషయాన్ని చెప్పింది. అనంతరం వాళ్లిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.