శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (11:49 IST)

నాటు బాంబును కొరికిన శునకం.. అక్కడికక్కడే మృతి

నాటు బాంబును శునకం కొరకడంతో అది మృతి చెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరులో నాటు బాంబు కలకలం రేపడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో నాటు బాంబు పేలి శునకం దుర్మరణం చెందింది. నాటు బాంబును కొరికిన శునకం.. ఘటన స్థలంలో కుప్పకూలింది.

గురువారం రాత్రి జాతీయ రహదారి పక్కనే బస్టాండ్ వద్ద దుకాణాల సముదాయం నడుమ భారీ శబ్దము రావడంతో.. స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని ఆధారాలు సేకరిస్తున్నారు.