శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 10 జులై 2021 (13:00 IST)

డీపీఆర్ఓ భాస్కర నారాయణకు విజయవాడ ఎస్ఐసి ఎడిగా పదోన్నతి

మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పౌర సంబంధాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న యం. భాస్కర నారాయణకు సహాయ సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ సమాచార శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

1993లో ఎపిపియస్సి ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా డిపిఆర్ఓ కార్యాలయంలో సహాయ పౌర సంబంధాధికారిగా నియమియలైన భాస్కర నారాయణ కొవ్వూరు, నర్సాపురంలో డివిజనల్ పౌర సంబంధాధికారిగా పనిచేసి పదోన్నత పై 2017 సెప్టెంబర్ లో కృష్ణా జిల్లా పౌర సంబంధాధికారిగా నియమితులైయ్యారు.

ప్రస్తుతం డిపిఆర్‌గా పనిచేస్తున్న ఆయనకు విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. సమాచార శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు సహాయ సంచాలకులుగా ఆయన స్టేట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్లో భాధ్యతలను చేపట్టారు.