మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 10 జులై 2021 (20:04 IST)

అమర వీరునికి అశృనివాళి-జ‌వాన్ జ‌శ్వంత్ రెడ్డికి అంతిమ నివాళులు (video)

Jawan
భార‌త స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల‌తో పోరాడి వీర మ‌ర‌ణం పొందిన అమ‌ర జ‌వాన్ జ‌శ్వంత్ రెడ్డికి అంతిమ నివాళులు స‌మ‌ర్పించారు. గుంటూరు జిల్లా బాపట్ల కు చెందిన అమర జవాన్ మృతదేహం నిన్న అర్ధరాత్రి 12 గంటలకు బాపట్ల చేరింది. 
 
భారీ ఊరేగింపులో వచ్చిన జవాను పార్థివ దేహాన్ని చూసి ఊరు ఊరంతా కంట తడి పెట్టింది. ఈ ఉదయం రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సూచరిత అమరజావాను మృత‌దేహంపై పుష్ప‌గుచ్చం ఉంచి నివాళులర్పించారు. స‌రిహ‌ద్దుల నుంచి వ‌చ్చిన జ‌వాన్ల బృందం జ‌శ్వంత్ పార్ధివ శ‌రీరాన్ని మిల‌ట‌రీ లాంఛ‌నాల‌తో ఖ‌న‌నం చేశారు. 
 
దేశ ర‌క్ష‌ణ కోసం ప్రాణాలు అర్పించిన జ‌వ‌న్ జ‌శ్వంత్ రెడ్డి కుటుంబాన్ని హోం మంత్రి సుచ‌రిత ప‌రామ‌ర్శించారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున 50 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా అందించాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించిన‌ట్లు హోం మంత్రి తెలిపారు.