ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (17:22 IST)

గుంటూరు జిల్లాలో దారుణం: ఏకాంతంగా వున్న జంటపై..?

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకాంతంగా ఉన్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ, చికిత్స పొందుతూ మృతి చెందింది. 
 
నిజాంపట్నం మండలంపాలెం గుణంవారిపాలెంలో సోమవారం జరిగిందీ దారుణం. బొర్రా పున్నమ్మ(32), అద్దంకి బాలయ్యలపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 
 
అనంతరం తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బొర్రాపున్నమ్మ మృతి చెందింది. అద్దంకి బాలయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలంలో దర్యాప్తు పోలీసులు తెలిపారు.