సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (18:42 IST)

మహిళా పోలీసైన కోడలిపై మామ అత్యాచారం.. భర్త ట్రిపుల్ తలాఖ్ చెప్పడంతో..?

మహిళా పోలీసుగా పని చేస్తున్న కోడలిపై, కామంతో కళ్లు మూసుకుపోయిన మామ, తానూ పోలీసు అనే విషయాన్ని మర్చిపోయి లైంగిక దాడి చేసాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మీరట్‌లో రిజర్వ్ ప్రోవిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మహిళ…జూన్ 23, బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆమె మామ నజీర్అహ్మద్ ఇంట్లోకి ప్రవేశించి కోడలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని కోడల్ని బెదిరించాడు. జరిగిన ఘోరాన్ని భర్త అబిద్‌కు చెప్పింది. ఆమెకు అండగా నిలవాల్సిన భర్త తండ్రికే మద్దతు తెలిపాడు.
 
ట్రిపుల్ తలాఖ్ చెప్పి ఆమెకు విడాకులిచ్చేసి, తప్పుచేసిన తండ్రిని దండిచకుండా తప్పించుకున్నాడు. దీంతో బాధితురాలు మీరట్ ఎస్పీని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. కేసును కొత్వాలి పోలీసు స్టేషన్ కు బదిలీ చేసి విచారణ జరపమని ఆదేశించారు ఎస్పీ వినీత్ భట్నాగర్.
 
పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న ఆమె మామ భర్తలపై కేసు నమోదు చేసారు పోలీసులు. బాధిత మహిళా కానిస్టేబుల్ భర్త మీరట్ లోని పోలీసు లైన్స్ లో పని చేస్తుండగా…. మామ ప్రస్తుతం ఘజియాబాద్ లో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం బాధిత మహిళకు అబిద్‌తో వివాహాం జరిగింది. అప్పటి నుంచి అత్తమామలు అదనపు కట్నంకోసం కూడా వేధిస్తున్నారని బాధితురాలు తమ ఫిర్యాదులో పేర్కొంది.