శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (11:25 IST)

కలలోకి వచ్చి మాంత్రికుడు అత్యాచారం చేస్తున్నాడు.. వింత కేసు.. ఎక్కడ?

బీహార్‌లో ఓ మహిళ పోలీసులకు వింత ఫిర్యాదు చేసింది. తన కలలోకి ఓ మాంత్రికుడు వచ్చి అత్యాచారం చేస్తున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. గతేడాది చివరిలో బీహార్‌లోని గాంధీనగర్‌లో ఉండే మహిళ కుమారుడు అనారోగ్యం పాలవ్వడంతో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లింది. కుమారుడి ఆరోగ్యం కోసం మాంత్రికుడు పూజలు చేశాడు. కానీ, ఆరోగ్యం కుదుటపడకపోగా, జనవరిలో మృతిచెందాడు.
 
దీనిపై మాంత్రికుడిని నిలదీసేందుకు వెళ్లగా, మాంత్రికుడు తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని, తన కుమారుడే తనను రక్షించాడని తెలిపింది. ఆ తరువాత తన కలలోకి వచ్చి మాంత్రికుడు అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, మహిళ ఫిర్యాదు మేరకు చతుర్వేదిని పోలీసులు విచారించారు. ఆమెను ఇప్పటి వరకు చూడలేదని చతుర్వేది పోలీసులకు తెలిపాడు.