సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (11:14 IST)

ప్రేమ పేరుతో వేధింపులు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..?

నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల అకృత్యాలు ఆగట్లేదు. రోజు రోజుకీ దారుణాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది.

జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని సూసైడ్ నోట్ రాసి.. మరీ ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం వేకువ జామున చోటుచేసుకుంది.
 
ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న యువతి… లైంగికంగా వాడుకుని వేధిస్తున్నాడని ఓ లేఖ రాసింది. అతని టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ పేర్కొంది యువతి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. 
 
విషయం తెలియగానే… ఆ యువతి తల్లిదండ్రులు శోక సంద్రంలోకి వెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నిమిత్తం… కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.