సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:13 IST)

శ్రీశైలంలో డ్రోన్ల కలకలం... పుష్కరిణికి సమీపంలో గుర్తింపు

ఏపీలోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోమారు డ్రోన్ల కలకలం కనిపించింది. పుష్కరిణికి దగ్గర ఈ డ్రోన్ల సంచారాన్ని భక్తులు గుర్తించారు. ఆ తర్వాత డ్రోన్లను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ డ్రోన్లను ఆపరేట్ చేసిన అధికారులను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
అలాగే, గుజరాత్ రిజిస్ట్రేషన్‌తో కూడా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరివద్ద భద్రతా అధికారులు విచారణ జరుపగా ఒకదానికొకటి పొంతనలేకుండా సమాధానాలు ఇచ్చారు. అసలు డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి కారణాలపై వారు ఆరా తీస్తున్నారు. 
 
గతంలో కూడా శ్రీశైలంలో డ్రోన్ల సంచారం కనిపించిన విషయం తెల్సిందే. గత యేడాది జూలై నెలలో అర్థరాత్రి వేళ ఈ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. వీటిని గుర్తించేందుకు అపుడు ఆలయ అధికారులతో పాటు.. జిల్లా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెల్సిందే.