ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు 'ఈ-వాచ్' మొబైల్‌యాప్
'ఈ-వాచ్' పేరుతో మొబైల్‌యాప్‌తో పాటు కాల్ సెంటర్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రారంభించనున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ యాప్‌ను తీసుకువస్తున్నటు తెలుస్తోంది.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎన్నికలకు సంబంధం ఉండే ఏ ఇతర సమస్యలు మీదనైనా ఫిర్యాదులు చేసేవారు ఈ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చునని, యాప్‌ను కూడా సద్వినియోగపరుచుకోవచ్చని ఎస్‌ఇసి కార్యాలయం తెలిపింది.
అయితే ఈ యాప్ ఇప్పుడు వివాదాస్పదమౌతోంది. ఈ యాప్ తీసుకురావడంపై అధికార వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఇది రమేష్ కుమార్ ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు యాప్ అని, తమకు తెలియకుండా దీన్ని రూపొందించారని విమర్శిస్తున్నారు.