శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:28 IST)

ఉగాది పచ్చడి తినండి, ఈ సంవత్సరం మనకే మంచిరోజులు: చంద్రబాబు

తిరుపతిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో చంద్రబాబు వేడుకల్లో పాల్గొన్నారు. ఉగాది పంచాంగ పఠణాన్ని ఆసక్తిగా విన్నారు చంద్రబాబు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఉగాది టిడిపికి ఎంతో అనుకూలమన్నారు. ఈ సంవత్సరం మొత్తం రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం మనదేనని.. ఉప ఎన్నికల నుంచే మొదటి మెట్టు ఎక్కుతామన్నారు.
 
ఆత్మస్తైర్యంతో ముందుకు వెళతామని.. విజయం మనకే సొంతమన్నారు. గత యేడాది నెలకొన్న చీకట్లు అందరూ అనుభవించారని.. ప్లవనామ సంవత్సరంలో వాటిని అధిగమనించడానికి యత్నించాలన్నారు. ఆరు రుచులతో ఉగాది పచ్చడి తయారు చేస్తారని చెప్పారు.
 
మన జీవితంలో అనుభవాలకు అది ప్రతిరూపమన్నారు. ఈ సంవత్సరం కూడా మంచిచెడులు ఉంటాయని.. ఫలితాలు ఆశించకుండా కర్మలు చేయాలన్నారు. నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలుసునని.. సమస్యలకు భయపడి వెనక్కు వెళ్ళకూడదన్నారు. ధైర్యంగా దేన్నయినా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.