శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 26 మే 2021 (21:21 IST)

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం, పంటలనే కాదు రైతులను తొక్కి చంపుతున్నాయి

చిత్తూరు జిల్లాలో గజరాజులు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఇష్టానుసారం రోడ్లపైన, జనావాసాల మధ్య, పొలాల్లో, గ్రామాల మధ్య ఇలా ఎక్కడపడితే అక్కడ తిరిగేస్తున్నాయి. ఏనుగులను భయపెట్టి అటవీ ప్రాంతంలోకి తరుముదామని చూస్తున్న వారిపై దాడి చేస్తున్నాయి.
 
చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ఏనుగల భీభత్సం అంతా ఇంతా కాదు. వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి. పదుల సంఖ్యలో రైతులు, గ్రామస్తులను గాయపరిచాయి. అటవీ శాఖాధికారులకు ఎన్నిసార్లు గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నా ఉపయోగం లేకుండా పోతోంది.
 
తాజాగా గంగాదర నెల్లూరు మండలం వేల్కూరు ఇందిరానగర్ గ్రామ సమీపంలో ఏనుగుల సంచారం కనిపించింది. పంట పొలాల్లో పనిచేస్తున్న వజ్రవేలు అనే వ్యక్తి ఏనుగుల గుంపును తరిమేందుకు ప్రయత్నించడంతో అతనిపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో అతన్ని హుటాహుటిన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వజ్రవేలు మృతి చెందారు. గత వారం రోజుల్లోనే ముగ్గురు ఏనుగుల దాడిలో మృత్యువాతపడ్డారు.