బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (16:50 IST)

రాజధానిలో మహా భారీ వాహాన ర్యాలీ నిర్వహించిన రైతులు

రాజధాని రైతుల మహర్యాలీ కార్యక్రమాన్ని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. తుళ్లూరు మండలంలోని 29 గ్రామాల్లో ప్రజలు మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ జై అమరావతి అనే నినాదాలతో వాహన ర్యాలీలో రైతులు పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో ఐదు సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయసున్న రైతులు, మహిళలు దీక్ష శిబిరం నుండి తుళ్లూరు ప్రధాన విధుల్లో భైక్ ర్యాలీ వల్ల రోడ్లు మొత్తం ఆకుపచ్చ వాతావరణం చోటు చేసుకుంది.
 
29 గ్రామాల్లోని ప్రజలు రోడ్డెక్కడంతో రోడ్డులన్ని కిక్కిరిసిపోయాయి. ఈ బైక్ ర్యాలీలో రూటు తుళ్లూరు నుండి బయలుదేరి రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, మోదు లింగాయపాలెం వెలగపూడి మల్కాపురం మందడం కృష్ణాయపాలెం, పెనుమాక ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం వడ్డమాను, హరిచంద్ర పురం, బోరుపాలెం దొండపాడు, గ్రామాల మీదుగా తుళ్లూరు చేరనుంది.