శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 30 జూన్ 2018 (21:49 IST)

జల్సా కోసం కన్న కుమార్తెను లక్షన్నరకు వ్యభిచార గృహానికి...

కర్నూలు జిల్లా నంద్యాలలో భర్త నిర్వాకాన్ని బయటపెట్టింది భార్య. మద్యానికి, జల్సాలకు బానిసై భార్యకు తెలియకుండా లక్షన్నర రూపాయలకు పెద్ద కుమార్తెను వ్యభిచార గృహానికి అమ్మేశాడు భర్త మద్దిలేటి. ఈ దుర్మార్గపు చర్యను బయటపెట్టింది అతని భార్య వెంకటమ్మ. భర్త వే

కర్నూలు జిల్లా నంద్యాలలో భర్త నిర్వాకాన్ని బయటపెట్టింది భార్య. మద్యానికి, జల్సాలకు బానిసై భార్యకు తెలియకుండా లక్షన్నర రూపాయలకు పెద్ద కుమార్తెను వ్యభిచార గృహానికి అమ్మేశాడు భర్త మద్దిలేటి. ఈ దుర్మార్గపు చర్యను బయటపెట్టింది అతని భార్య వెంకటమ్మ. భర్త వేధింపులు తాళలేక కొన్ని రోజులుగా వేరుగా పిల్లలతో కలిసి ఉంటోంది వెంకటమ్మ. భార్యా వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఆమె వద్దకు వచ్చిన మద్దిలేటి భార్యపై దౌర్జన్యం చేశాడు. 
 
ఈసారి భార్యతో సహా పిల్లలందరినీ కలిపి 11 లక్షల రూపాయలకు అమ్మేశాడు. బాండ్ పేపర్లపై సంతకం తీసుకొనేందుకు ఒక వ్యక్తి రావడంతో అతన్ని చితకబాదారు. స్థానికుల సాయంతో వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.