బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (16:08 IST)

డబ్బు కోసం భార్య.. ఉద్యోగం కోసం కుమార్తె... పోలీసు భర్తను చంపేశారు...

ఇంటికి పెద్ద దిక్కునే చంపేశారు.. తల్లీకూతుళ్లు. అదీ కూడా పోలీసు భర్త. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మురుగునీటి కాల్వలో పడేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ దారుణం

ఇంటికి పెద్ద దిక్కునే చంపేశారు.. తల్లీకూతుళ్లు. అదీ కూడా పోలీసు భర్త. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మురుగునీటి కాల్వలో పడేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజన్‌పూర్ నగరంలో జరిగింది.


ఈ వివరాలను పరిశీలిస్తే.. షాజన్‌పూర్‌కు చెందిన మెహర్బాన్ అలీ అనే వ్యక్తి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య జహీదా, నలుగురు కుమార్తెలు. పోలీసు ఉద్యోగం కావడంతో ఇంట్లోనూ కాస్త స్ట్రిక్ట్‌గా ఉండేవాడు. పైగా, భార్యతో పాటు కుమార్తెల బయట తిరుగుళ్లపై లేనిపోని ఆంక్షలు పెట్టాడు. చదువు, ఇల్లు మాత్రం ఉండాలని ఆదేశించాడు. అయినా ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చాడు. 
 
ఇంట్లో స్ట్రిక్ట్‌గా ఉండటమే ఆయన చేసిన తప్పు. అలాంటి భర్తను చంపేయాలని భార్య నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తన మాట వినే కుమార్తెకు చెప్పింది. వీరిద్దరూ అనుకున్నదే తడవుగా కిరాయి హంతుకులతో మాట్లాడారు. వారిద్వారా పోలీసు భర్తను చంపేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన ఆదివారం డ్యూటీ ముగించుకుని అలీ ఇంటికి వచ్చాడు. అపుడు అందరూ యధావిధిగానే నడుచుకున్నారు. ఆ రోజు అర్థరాత్రి తమ పథకం అమలు చేశారు. ఇంట్లోనే ఉన్న తండ్రి ఆచూకీని కిల్లర్స్‌కు చేరవేశారు. వారి వచ్చిన గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ కూడా బైక్‌పై మృతదేహాన్ని వారి ఇంటికి 250 మీటర్ల దూరంలో ఉండే మురికి కాలువలో పడేశారు. అలీ పోలీస్ బైక్‌ను కూడా మాయం చేశారు. ఆ తర్వాత అర్థరాత్రి ఇంటికి వస్తూ ప్రమాదవశాత్తూ డ్రైనేజ్‌లో పడి చనిపోయాడని నమ్మించటానికి ప్రయత్నించారు. 
 
ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలే ఎస్.ఐ కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో మృతదేహాన్ని కనుగొని పోస్టుమార్టం పంపించారు. ఇందులో గొంతునులిమి హత్య చేసినట్టు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యుల వద్ద విచారణ జరుపగా అసలు విషయం వెల్లడించారు. 
 
తండ్రి చనిపోతే ఆ ఉద్యోగం నాకు వస్తుందన్న ఆశతో కూతురు, ఇంట్లో ఆంక్షలు పెట్టటంతో భరించలేక భార్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చనిపోతే ఉద్యోగంతోపాటు పెన్షన్ కూడా వస్తుందని.. మరింత డబ్బుతో బాగా బతకొచ్చనే ఆలోచనతోనే ఈ విధంగా చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజన్ పూర్ నగరంలో సంచలనం సృష్టించింది.