బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (19:53 IST)

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం: ధర్మరధంలో మంటలు

Tirumala free bus
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి భక్తులను ఉచిత రవాణా సేవలు అందించే శ్రీవారి ధర్మరధంలో మంటలు చెలరేగాయి. మంటలను సకాలంలో గమనించిన డ్రైవర్‌ వెంటనే బస్సును లింక్‌ రోడ్డు వద్ద నిలిపివేశాడు. 
 
ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సు నుండి కిందకు దిగిడంతో ప్రాణప్రాయం తప్పింది. బాధితులు ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టీటీడీ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 
 
బస్సు నుంచి డిజిల్ లీకై ఈ ప్రమాదం జరిగిఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దాని పైన అధికారులు ఆరా తీస్తున్నారు.