హైకోర్టులో నలుగురు నూతన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి నలుగురు నూతన న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
సోమవారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి నూతన న్యాయమూర్తులుగా నియమించబడిన జస్టిస్ రావు రఘునందనరావు, బత్తు దేవానంద్, దోనాడి రమేశ్, నైనాల జయసూర్యలను న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయ మూర్తులు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.