మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (15:56 IST)

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం : హైకోర్టు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. నాలుగు మృతదేహాలకు మళ్ళీ రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు అదేశించింది. 23న 5వ తేదీలోగా రీపోస్టుమార్టం పూర్తి చేయాలని ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం కూడా వీడియో తీయాలని కోరింది. 

కలెక్షన్స్ ఆఫ్ ఏవిడెన్స్‌ను షీల్డ్ కవర్‌లో భద్రపరచాలని సూచన చేసింది. మెడికల్ బోర్డు ఆఫ్ ఇండియా వారితో రీపోస్టుమార్టం చేపించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కోరాలి. గాంధీ సూపర్ డెంట్ శ్రావణ్ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది.

ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఏవిడెన్స్‌ను  బుల్లెట్స్, గన్స్, ఫోరెన్సిక్, పొస్ట్ మార్టం రిపోర్ట్‌లు అన్ని బద్రపరచాలని ఆదేశించింది. రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత పోలీసుల సమక్షంలో ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించింది.