ఆదివారం, 13 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (17:46 IST)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

sree leela
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. సినిమా షూటింగ్ తర్వాత తిరిగి వెళుతున్న సమయంలో కొంతమంది అకతాయిలు ఆమె చేయిపట్టుకుని లాగారు. దీంతో ఆమె తడుమారారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా, దక్షిణాదిలో వరుస చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో ప్రేమకథా చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందుకోసం చిత్రబృందం డార్జిలింగ్‌కు వెళ్లింది. సినిమా షూటింగ్ తర్వాత ఆమె హీరో కార్తిక్ ఆర్యనతో కలిసి తిరిగి వెళుతుండగా వారిని చూసేందుకు స్థానికులు, అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. 
 
ఈ క్రమంలోనే కార్తిక్ వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగగా, ఆ వెనుక శ్రీలీల నవ్వుకుంటా వచ్చారు. చుట్టూ బాడీగార్డులు వారిని సంరక్షిస్తున్నా గుంపులో నుంచి కొంతమంది అకతాయిలు ఆమె చేయిపట్టుకుని బలవంతంగా లాగారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. వారి నుంచి సెక్యూరిటీ సిబ్బంది శ్రీలీలను రక్షించి సురక్షితంగా తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అకతాయి అభిమానులపై శ్రీలీలతో పాటు నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.