ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)
పెళ్లి అంటే నూరేళ్ల పంట. అది సంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతుంది. జరిగేది. కానీ ఇటీవలి కాలంలో పెళ్లికి ముందే ప్రి-వెడ్డింగ్ షూట్ అంటూ కొన్ని జంటలు వెరైటీగా ఫోటో షూట్ చేస్తున్నారు. ఇంకొందరు ఇలాంటి వాటి వల్ల ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు.
తాజాగా ఓ జంట తమ ప్రి-వెడ్డింగ్ షూట్లో భాగంగా వీడియో షూట్ చేసుకుంది. ఇందులో భాగంగా మరింత ఎఫెక్టుగా వుండేందుకు గాను యువతిని యువకుడు పైకెత్తి పట్టుకుని అలా గాల్లోకి లేపినపుడు టపాసులు పేల్చారు. అవి కాస్తా దుస్తులకు అంటుకుని ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.