సోమవారం, 7 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (13:52 IST)

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

Shraddha Kapoor
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాకపూ‌ర్‌ను కించపరిచేలా నిర్మాత దినేశ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల విజయవంతమైన "స్త్రీ-2"లో శ్రద్ధ నటించిన విజయం తెల్సిందే. అయితే, ఈ మూవీ కోసం శ్రద్ధను ఎంపిక చేయడానికి ఆమె నవ్వే కారణమని, ఆమె అచ్చంగా దెయ్యంలా నవ్వుతుందని దినేశ్ విజయ్ అన్నారు. ఈ విషయాన్ని 'స్త్రీ-2' దర్శకుడు అమర్ కౌశిక్ వెల్లడించారు. 
 
తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ కౌశిక్ మాట్లాడుతూ, 'స్త్రీ-2' చిత్రంలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే నిర్మాత దినేశ్ కల్పించుకుని శ్రద్ధా కపూర్ పేరును ప్రతిపాదించారని చెప్పారు. 
 
అలాగే, ఆ పాత్ర కోసం ఆమెను ఎంచుకోవడానికి కారణం కూడా చెప్పారు. ఓసారి శ్రద్ధా కపూర్, దినేశ్ ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారని, ఆ సమయంలో జరిగిన సంభాషణలో శ్రద్ధ అంచ్ఛం దెయ్యంలా నవ్వుతుందని దినేశ్ అన్నారు. అందువల్ల ఈ పాత్రకు శ్రద్ధనే పూర్తి న్యాయం చేయగలదని దినేశ్ తనతో చెప్పారని అమర్ కౌశిక్ వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దినేశ్ విజయ్ వ్యాఖ్యలపై శ్రద్ధా కపూర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.