Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఏపీలో వరుణుడు ప్రతాపం

Written By ఎంజీ
Updated: గురువారం, 18 నవంబరు 2021 (18:22 IST)
అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఏపీలో వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు..ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి.
 
ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

రానున్న రెండ్రోజులు కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.

కడప జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మరో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్‌. ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు స్కూల్స్‌కు సెలవులిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
జగన్‌ సమీక్ష
భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో.. తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

రిజయర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆహారం, మందులు సిద్ధంచేసుకోవాలన్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments