సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (22:38 IST)

రైతులకు గుడ్‌ న్యూస్‌.. రైతుల ఖాతాల్లో డబ్బు

రైతులకు గుడ్‌ న్యూస్‌. రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.  2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.
 
రేపు (ఫిబ్రవరి 15, 2022) ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు జమ చేయబోతున్నారు. రాష్ట్రంలోని 5,71,478 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా లబ్ధి చేకూరనుంది. మొత్తంగా రైతుల ఖాతాల్లో రూ.534.77 కోట్లు జమ చేయనున్నారు ఏపీ సీఎం.