గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (13:43 IST)

ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల సర్వదర్శనం టిక్కెట్లు

ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంలో భాగంగా స్లాట్‌ సర్వదర్శనం టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను విడుదల చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీవరకు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనార్థం టోకెన్లు మాత్రమే జారీచేస్తున్నామని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్‌ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. శ్రీ వేంకటేశ్వ రస్వామి దర్శనం కోసం ఫిబ్రవరికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా భక్తులు నిమిషాల్లోనే బుక్‌ చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో రోజుకి 12,000 చొప్పున టికెట్లను విడుదల చేశారు.