శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (11:47 IST)

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. జనవరి 28వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో 3 వందల రూపాయల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తోంది. 
 
ఇవాళ ఈ ప్రత్యేక దర్శనం టికెట్లు, రేపు అంటే జనవరి 29వ తేదీ ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. 
 
రోజుకు కేవలం 12 వేల టికెట్లు జారీ చేయనున్నారు. అటు సర్వదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల చొప్పున ఆన్‌‌లైన్‌లో విడుదల కానున్నాయి. 
 
కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున.. పరిమిత సంఖ్యలో టికెట్ల విడుదల ఉంటుందని టీటీడీ వెల్లడించింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి.