1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జులై 2016 (15:25 IST)

ఊరకే వచ్చా.. తెలుగోళ్ళ సమస్యలన్నీ కేంద్రమే చూసుకుంటుంది : నరసింహన్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను ఢిల్లీకి వచ్చాను కాబట్టి మర్యాద పూర్వకంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశానని, అంతకన్నా మరే ఇతర కారణాలు లేవని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. 
 
కాగా, సోమవారం ఉదయం మోడీతో నరసింహన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పిన నరసింహన్, కృష్ణా జలాల పంపిణీ విషయంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. చర్చలతో లాభం లేదనుకుంటే కేంద్రం కల్పించుకుంటుందన్నారు.