గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:18 IST)

గులాబ్ తుఫాన్ సహాయక చర్యలు వేగవంతం చేయాలి: సాకే శైలజానాథ్

రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ సృష్టించిన నష్టం పై ప్రభుత్వం త్వరితగతిన అంచనాలు వేసి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కోరారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆయన ఆంధ్ర రత్న భవన్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో వరదల కారణంగా దెబ్బ తిన్న రోడ్లకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

తుఫాన్ సృష్టించిన నష్టం పై ప్రభుత్వం త్వరితగతిన అంచనాలు వేసి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.