శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 27 సెప్టెంబరు 2021 (10:54 IST)

గులాబ్ తుఫానుతో అత‌లాకుత‌లం... రోడ్లపై కూలిన చెట్లు!

గులాబ్ తుపాను తీరం దాట‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చాలా చోట్ల అత‌లాకుత‌లం అయిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్ల‌కు అడ్డంగా కుప్పకూలిన చెట్లు తొలిగింపు కార్యక్రమం గత అర్థరాత్రి నుండి చురుగ్గా సాగుతోంది. జాతీయ విపత్తుల నివారణ సంస్థ సిబ్బంది, రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు, శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది కలిసి యుద్ధప్రాతిపదికన చెట్లు తొలగిస్తున్నారు. రహదారికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు.

గార,జి.సిగడం,పొలాకి,వజ్రపుకొత్తూరు, పలాస,సోంపేట,టెక్కలి,నరసన్నపేట లలో చెట్లు ఎక్కువ సంఖ్యలో కుప్పకూలాయి. తుఫాన్ తాకిడికి శ్రీకాకుళం జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తుఫాన్ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వొద్ద తీరం దాటిన సమయంలో 75 నుండి 90 కిలోమీటర్లు వరకు వేగంగా గాలులు వీచాయి.ఆ సమయంలో అనేక చోట్ల మహావృక్షాలు నేలకొరిగాయి.