శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:26 IST)

హెలికాప్టర్లో కాదు, రోడ్లపై తిరుగు జ‌గ‌న్: ఎంపీ రఘురామ

ఏపీలో జ‌రుగుతున్న ప్ర‌తి ప‌రిణామంపైనా రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు స్పీడ్ గా స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోడ్ల అద్వాన్న స్థితిపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. 
 
ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందనను ఆహ్వానిస్తున్నానని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, నువ్వు త‌ర‌చూ హెలికాప్టర్లలో కాకుండా, రోడ్లపై తిరగాలని సీఎం జగన్‌ను కోరుతున్నానన్నారు. మీ చుట్టూ ఉండేవారు ప్రజా సమస్యల గురించి చెప్పడం లేదా? అని ప్రశ్నించారు.
 
ఇక గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల‌పైనా ర‌ఘ‌రామ స్పందించారు. ఒక్క దేవాలయాలకే కరోనా నిబంధనలా? అని రఘురామ నిలదీశారు. కరోనాను సాకుగా చూపి గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయని రఘురామ సెటైర్ వేశారు.