సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 సెప్టెంబరు 2021 (17:17 IST)

హైదరాబాద్ నగరంపై 'గులాబ్' ప్రభావం, అతి భారీ వర్షం కురిసే అవకాశం, జాగ్రత్త

గులాబ్‌ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అప్రమత్తమైంది. సోమవారం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో మరికొద్ది గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించింది.
 
మరోవైపు పోలీసు వ్యవస్థ కూడా అప్రమత్తమైంది. ట్విట్టర్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నగరంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్‌ ప్రకటించింది.